హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదు! | Sonam kapoor has no new film post 'Neerja', feels 'stressed out' | Sakshi
Sakshi News home page

హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదు!

Mar 31 2016 2:29 PM | Updated on Sep 3 2017 8:57 PM

హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదు!

హిట్ హీరోయిన్‌కు ఒక్క సినిమా లేదు!

నీరజ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆ సినిమా విడుదలై.. మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఇంతవరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

నీరజ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆ సినిమా విడుదలై.. మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఇంతవరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. చేతిలో సినిమాలు లేవని తాను బాగా ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె చెబుతోంది. విమానంలో హైజాకర్ల బారి నుంచి ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు తన సొంత ప్రాణాలను పణంగా పెట్టిన నీరజా భానోత్ అనే ఎయిర్ హోస్టెస్ పాత్రలో సోనమ్ నటించిన విషయం తెలిసిందే.

గత కొన్నాళ్లుగా సినిమాల్లో మహిళలను చాలా ధైర్యవంతమైన పాత్రలలో చూపిస్తున్నారని, అయినా పారితోషికం విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని వాపోయింది. నీరజ లాంటి సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నా థియేటర్లు దొరకడం లేదని.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి కేవలం 700 స్క్రీన్లలోనే సినిమా విడుదలైందని సోనమ్ చెప్పింది. పరిశ్రమ మనకు ఎంత ఇస్తోందన్నది విషయం కాదని, ప్రేక్షకులు సినిమా చూడాలనుకుంటున్నారా లేదా అనేది చూడాలని అంటోంది. తన సినిమాకు 6 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు వస్తే.. ఆ డబ్బును నిర్మాత తనకు ఇవ్వాలా అక్కర్లేదా అని అడిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement