Sonakshi Sinha Fires on Indigo Airlines on Damaging her Bag | నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు - Sakshi
Sakshi News home page

నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్‌ ఆగ్రహం

Nov 4 2019 2:47 PM | Updated on Nov 4 2019 3:20 PM

Sonakshi Sinha Fires on IndiGo for damaging her bag  - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం​ చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆమె.. విమాన ప్రయాణంలో తన ఖరీదైన లగేజ్‌ బ్యాగ్‌ డ్యామేజ్‌ చేశారని, బ్యాగ్‌ హ్యాండిల్‌, వీల్స్‌ విరిగిపోయాయంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు. పటిష్టమైన బ్యాగ్‌ను ధ్వంసం చేసిపారేశారంటూ ఆమె మండిపడ్డారు. మంచి బ్యాగ్‌ను తీసుకొని మీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తే.. ప్రయాణం ముగిసేసరికి బ్యాగ్‌ రెండు హ్యాండిల్స్‌ విరిగిపోయానని, వీల్స్‌ పూర్తిగా ఊడిపోయానని, మీ ధాటికి సామ్‌సొనైట్‌ బ్యాగ్‌ తట్టుకోలేకపోయిందంటూ ఇండిగో సిబ్బందికి సోనాక్షి వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సోనాక్షి ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అక్షయ్‌కుమార్‌తో కలిసి మిషన్‌ మంగళ్‌ సినిమాలో నటించిన ఈ అమ్మడు త్వరలో సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘దబాంగ్‌-3’ లో అలరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement