ఎప్పుడు చూపిస్తారు? | Soho's first look released on August 15 | Sakshi
Sakshi News home page

ఎప్పుడు చూపిస్తారు?

Aug 4 2017 11:06 PM | Updated on Oct 22 2018 8:06 PM

ఎప్పుడు చూపిస్తారు? - Sakshi

ఎప్పుడు చూపిస్తారు?

‘బాహుబలి’ ప్రభాస్‌ బాగా బరువు తగ్గారీ మధ్య.

‘బాహుబలి’ ప్రభాస్‌ బాగా బరువు తగ్గారీ మధ్య. ఇదంతా ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా ‘సాహో’ కోసమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! రీసెంట్‌గా రిలీజైన స్టిల్స్‌లో ప్రభాస్‌ బరువు తగ్గిన సంగతి తెలుస్తోంది. ఇంచు మించు ఐదేళ్ల పాటు ప్రభాస్‌ను బాహుబలిగా, ఆజానుబాహుడిగా చూసిన ఫ్యాన్స్‌కు ఈ కొత్త లుక్‌ కిక్కిచ్చింది.

అయితే... ‘సాహో’లో లుక్‌ ఇదేనంటూ దర్శక–నిర్మాతలు ఎక్కడా చెప్పలేదు. దాంతో వాళ్లంతా ప్రభాస్‌ ‘సాహో’ లుక్‌ ఎప్పుడు చూపిస్తారు? అని ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల ఎదురు చూపు లకు పంద్రాగస్టుతో తెర పడ నుందట! ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ‘సాహో’లో ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement