జీవితాంతం రుణపడి ఉంటా | Software Sudheer Movie Success Meet | Sakshi
Sakshi News home page

జీవితాంతం రుణపడి ఉంటా

Dec 31 2019 2:13 AM | Updated on Dec 31 2019 10:55 AM

Software Sudheer Movie Success Meet - Sakshi

‘‘వారానికి మూడు రోజులు బుల్లితెరపై కని పిస్తాను. వెండితెర మీద రెండు గంటలపాటు కనిపించే  పాత్ర చేస్తానని నా జీవితంలో ఊహించలేదు’’ అని ‘సుడిగాలి’ సుధీర్‌ అన్నారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘నా కోసం థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా.

మా సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది’’ అన్నారు.  ‘‘మా సినిమా రెండు రోజుల్లోనే 4కోట్ల 50 లక్షలు గ్రాస్‌ సాధించింది. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని ‘సాఫ్ట్‌వేర్‌’ శేఖర్‌ రాజుగా మార్చుకున్నాను’’ అన్నారు శేఖర్‌ రాజు. ‘‘మా సినిమాకి తెలుగులోనే కాదు.. కర్ణాటక లోనూ వసూళ్లు బాగున్నాయి’’ అన్నారు ధన్య బాలకృష్ణ.  సంగీత దర్శకుడు భీమ్స్, లిరిసిస్ట్‌ సురేష్‌ ఉపాధ్యాయ, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ పేపర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement