అందులో తప్పేముంది? | So what if Salman's overpowering in 'Kick', says Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

అందులో తప్పేముంది?

Jul 17 2014 6:26 PM | Updated on Sep 2 2017 10:26 AM

అందులో తప్పేముంది?

అందులో తప్పేముంది?

'కిక్' సినిమా ప్రచారంలో హీరో సల్మాన్ఖాన్ ఎక్కువగా ప్రమోట్ చేయడాన్ని హీరోయిన్ జాక్వెలెన్ ఫెర్నాంజెడ్ సమర్థించింది.

ముంబై: 'కిక్' సినిమా ప్రచారంలో హీరో సల్మాన్ఖాన్ ఎక్కువగా ప్రమోట్ చేయడాన్ని హీరోయిన్ జాక్వెలెన్ ఫెర్నాంజెడ్ సమర్థించింది. అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించింది. ప్రధాన పాత్ర పోషించిన సల్మాన్ఖాన్- సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడని కితాబిచ్చింది.

సల్మాన్ సూపర్ స్టార్ అని, ఆయనను ఎక్కువగా ప్రమోట్ చేయడం ఏమాత్రం తప్పుకాదని పేర్కొంది. సినిమా విజయానికి ఏదీ మంచో అదే చేస్తారని కూడా అంది. శ్రీలంకకు చెందిన జాక్వెలెన్ 2009లో అల్లాదీన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. 'కిక్' సినిమాకు సాజిద్ నడియాడ్‌వాలా దర్శకత్వం వహించగా, చేతన్ భగత్ స్క్రీన్ ప్లే అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement