మహేష్, పవన్ లతో ఒకేసారి | sj surya with mahesh babu, pawan kalyan | Sakshi
Sakshi News home page

మహేష్, పవన్ లతో ఒకేసారి

Jun 8 2016 5:33 PM | Updated on Mar 22 2019 5:33 PM

మహేష్, పవన్ లతో ఒకేసారి - Sakshi

మహేష్, పవన్ లతో ఒకేసారి

ఇద్దరు టాప్ హీరోలతో ఒకేసారి కలిసి పనిచేయటం ఎవరికైనా అరుదైన అవకాశమే. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు, కోలీవుడు నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య.

ఇద్దరు టాప్ హీరోలతో ఒకేసారి కలిసి పనిచేయటం ఎవరికైనా అరుదైన అవకాశమే. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు కోలీవుడు నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్లలో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు సూర్య. తరువాత తమిళ ఇండస్ట్రీలో హీరోగా మారి మంచి విజయాలు సాధించాడు. కేవలం హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే కొంతకాలంగా తమిళనాట సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్జె సూర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే మరో తెలుగు స్టార్ హీరో మహేష్ సినిమాలో విలన్గా నటించే ఛాన్స్ కొట్టేశాడు.

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్గా నటిస్తున్నాడు. ఒకేసారి ఇలా ఇద్దరు టాప్ స్టార్స్తో కలిసి పనిచేసే అవకాశం రావటంపై సూర్య ఆనందంగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement