అదే అక్కడ హాట్ టాపిక్! | Sivakarthikeyan to romance Samantha in Rajini Murugan | Sakshi
Sakshi News home page

అదే అక్కడ హాట్ టాపిక్!

Jul 15 2014 12:06 AM | Updated on Sep 2 2017 10:17 AM

అదే అక్కడ హాట్ టాపిక్!

అదే అక్కడ హాట్ టాపిక్!

సమంత ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా నిలిచారు. శివకార్తికేయన్‌కు జోడీగా సమంత నటించనున్నారని వినిపిస్తున్న వార్తే అందుకు కారణం. తమిళ సినిమాల్లో హాస్యనటునిగా

 సమంత ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా నిలిచారు. శివకార్తికేయన్‌కు జోడీగా సమంత నటించనున్నారని వినిపిస్తున్న వార్తే అందుకు కారణం. తమిళ సినిమాల్లో హాస్యనటునిగా శివకార్తికేయన్‌కు మంచి పేరుంది. ఈ మధ్యే చిన్న చిన్న సినిమాల్లో హీరోగా కూడా నటించేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘మాస్ కరాటే’ చిత్రంలో అయితే... కార్తికేయన్‌కు జోడీగా హన్సిక నటించారు. అప్పట్లో అదే పెద్ద టాపిక్ అయ్యింది. ఇప్పుడు సమంత కూడా అతనితో జత కట్టనుందని వార్తలు వినిపిస్తుండటం తమిళ చిత్ర సీమలో చర్చనీయాంశమైంది.
 
  శివకార్తికేయన్ హీరోగా ‘రజని మురుగన్’ పేరుతో చిత్రం రూపొందనుంది. ఆ సినిమాలో నటించడానికి సమంత పచ్చజెండా ఊపేశారట. సమంత ప్రస్తుతం తెలుగులో నంబర్‌వన్ హీరోయిన్. తమిళంలోనూ మంచి స్టార్‌హోదానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి, అలాంటి సమంత.. శివకార్తికేయన్ లాంటి చిన్న హీరోతో జతకట్టడమేంటి? అన్నదే ఇప్పుడు చర్చ. ఆ కథలోని తన పాత్ర నచ్చడం వల్లే సమంత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాకు సమంత పారితోషికం కూడా భారీగా ఉందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement