‘వీడు అసాధ్యుడు’ షూటింగ్ ప్రారంభం | Sivaji Raja Clapped For A New Movie Veedu Asadhyudu | Sakshi
Sakshi News home page

Aug 9 2018 5:29 PM | Updated on Aug 9 2018 5:35 PM

Sivaji Raja Clapped For A New Movie Veedu Asadhyudu - Sakshi

కమర్షియల్‌ అంశాలతో పాటు సోషల్‌ మెసెజ్‌ సినిమా అంటే ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఓ కొత్త సినిమా గురువారం ప్రారంభమైంది. ఫిలింనగర్‌లో మొదలైన సినిమాకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజా హాజరయ్యారు. ‘వీడు అసాధ్యుడు’ సినిమాతో మరో కొత్త హీరో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. 

ముహుర్తపు సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్‌ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ‘ఒక క‌మ‌ర్షియ‌ల్ అంశానికి సోష‌ల్ మెజేస్ జోడించి రూపొందిస్తోన్నాం. ఇందులో ల‌వ్, కామెడీ, యాక్ష‌న్ ఇలా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలుంటాయి.  హీరో అడ్వ‌కేట్ గా న‌టించారు. హీరోయిన్ ఒక ఎన్నారై పాత్ర‌లో న‌టిస్తోంది. వీరిద్ద‌రికీ ఎలా ప‌రిచ‌యం అయింది. ఆ ప‌రిచ‌యం ఎలాంటి మ‌లుపుల‌కు దారి తీసింద‌నే ఆస‌క్తిక‌రమైన అంశాలతో రూపొందుకుంటోన్న చిత్రమ’ని దర్శకుడు పియస్‌ నారాయణ తెలిపారు. తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని హీరో కృష్ణ సాయి కోరారు. ఈ సినిమాలో జహీదా శామ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని ఎమ్మెస్కే రాజు నిర్మించగా, శంభు ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement