‘ఛలో’ దర్శకుడి కొత్త సినిమా అప్‌డేట్‌ | Sithara Entertainment To Produce A Film With Nithiin And Venky | Sakshi
Sakshi News home page

Mar 7 2018 3:40 PM | Updated on Mar 7 2018 3:40 PM

Sithara Entertainment To Produce A Film With Nithiin And Venky - Sakshi

‘ఛలో’ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ప్రేమమ్‌, బాబు బంగారం లాంటి సినిమానలు తెరకెక్కించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఇదే బ్యానర్‌లో సుదీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది సితార ఎంటర్‌టైన్మెంట్స్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement