మూడు రోజుల్లో రూ. 54 కోట్ల కలెక్షన్లు | 'Singh is Bliing' mints Rs.54.44 crore in three days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో రూ. 54 కోట్ల కలెక్షన్లు

Oct 5 2015 2:07 PM | Updated on Sep 3 2017 10:29 AM

మూడు రోజుల్లో రూ. 54 కోట్ల కలెక్షన్లు

మూడు రోజుల్లో రూ. 54 కోట్ల కలెక్షన్లు

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' భారీ వసూళ్లను సాధిస్తోంది.

ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' భారీ వసూళ్లను సాధిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో 54.44 కోట్ల రూపాయలు రాబట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ ప్రారంభ వసూళ్లు సాధించిన చిత్రం ఇదే.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్, అమీ జాక్సన్, కే కే మీనన్, లారా దత్తా నటించారు. రౌడీ రాథోడ్ తర్వాత ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది.

 

Advertisement
 
Advertisement
Advertisement