ఆ సింగర్ అరెస్టై విడుదలయ్యాడు | Singer Mika Singh arrested and relesed soon after | Sakshi
Sakshi News home page

ఆ సింగర్ అరెస్టై విడుదలయ్యాడు

Jun 11 2015 4:52 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ సింగర్ అరెస్టై విడుదలయ్యాడు - Sakshi

ఆ సింగర్ అరెస్టై విడుదలయ్యాడు

ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికాసింగ్(38)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాసేపటికే అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికాసింగ్(38)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏప్రిల్లో జరిగిన ఓ కచేరి కార్యక్రమంలో డాక్టర్పై చేయిచేసుకున్న నేపథ్యం కేసులో ఆయనను గురువారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పశ్చిమ ఢిల్లీలోని ఇందర్ పురి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు.

ఢిల్లీలోని అంబేద్కర్ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తిని సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో వేదిక మీదకు పిలిచి ఏవో ప్రశ్నలు అడిగి అనంతరం చెంప చెల్లుమనిపించాడు. దీనికి సంబంధించి అప్పట్లోనే కేసు నమోదవ్వగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. మికా సింగ్పై ఇదే కాకుండా పలు కేసులు కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement