ముందుకు దూకడానికే! | singam-3 movie posteponed | Sakshi
Sakshi News home page

ముందుకు దూకడానికే!

Dec 2 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:44 PM

ముందుకు దూకడానికే!

ముందుకు దూకడానికే!

సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే నాలుగడుగులు ముందుకు దూకుతుందంటారు.

సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే నాలుగడుగులు ముందుకు దూకుతుందంటారు. ఇప్పుడు తమిళ నటుడు సూర్య అభిమానులు ఈ మాటే అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగం-3’ విడుదల ఓ వారం వెనక్కి వెళ్లింది. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 16న రిలీజ్ చేయాలనుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఓ వారం వాయిదా వేసి, రెండు భాషల్లోనూ ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్య, అనుష్క, శ్రుతీ హాసన్ ముఖ్యతారలుగా హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగులో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు.

త్వరలో తెలుగు పాటలు విడుదల చేయనున్నారు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. అన్నట్లు, సూర్య సినిమా ఒక వారం వెనక్కి వెళ్ళిందే తడవుగా, తెలుగులో కొన్ని సినిమాల రిలీజ్ ముందుకొచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement