నల్లగా.. ఎత్తు పళ్లతో... | Siddharth Shocking look in Enakkul Oruvan Tamil Movie | Sakshi
Sakshi News home page

నల్లగా.. ఎత్తు పళ్లతో...

Sep 10 2014 11:55 PM | Updated on Sep 2 2017 1:10 PM

నల్లగా.. ఎత్తు పళ్లతో...

నల్లగా.. ఎత్తు పళ్లతో...

సిద్ధార్థ్‌కి అమ్మాయిల్లో బోల్డంత ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం తను చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండటమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే, సిద్ధూకి లవర్‌బోయ్

సిద్ధార్థ్‌కి అమ్మాయిల్లో బోల్డంత ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం తను చాలా హ్యాండ్‌సమ్‌గా ఉండటమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే, సిద్ధూకి లవర్‌బోయ్ ఇమేజ్ కూడా ఉంది. కానీ, తన ఇమేజ్‌ని పక్కన పెట్టి, అంద విహీనంగా కనిపించడానికి సిద్ధార్థ్ రెడీ అయిపోయారు. తమిళ చిత్రం ‘ఎనక్కుళ్ ఒరువన్’లోనే సిద్ధూ ఈ విధంగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అతను సినిమా థియేటర్ ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా, సినీ హీరోగా నటిస్తున్నారు. ఆపరేటర్ పాత్రలో నల్లగా, ఎత్తుపళ్లతో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సిద్ధూ లుక్ చూసి, కోలీవుడ్‌లో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పాత్రలోకి సిద్ధూ పరకాయ ప్రవేశం చేసిన వైనం సూపర్బ్ అని అభినందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement