18 నెలలు టైమ్‌ ఇవ్వండి! | Siddharth promises Telugu audience a comeback | Sakshi
Sakshi News home page

18 నెలలు టైమ్‌ ఇవ్వండి!

May 4 2019 3:55 AM | Updated on May 4 2019 3:55 AM

Siddharth promises Telugu audience a comeback - Sakshi

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో సిద్ధార్థ్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కొంతకాలంగా సిద్ధార్థ్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించడం తగ్గింది. 2017లో ‘గృహం’ అనే హారర్‌ సినిమాతో కనిపించారు. లేటెస్ట్‌గా నేను మళ్లీ తెలుగుకు తిరిగి వస్తున్నాను అంటున్నారు సిద్ధార్థ్‌. ‘‘ఎవరేమన్నా నేను తిరిగి వస్తాను. ఈ ప్రామిస్‌ను గుర్తు పెట్టుకోండి. నా తెలుగు ప్రేక్షకులను మరొక్కసారి తప్పకుండా ఆకట్టుకుంటాను. నాకు 18 నెలల సమయం ఇవ్వండి. మంచి కథ దారిలో ఉంది. త్వరలోనే మాట్లాడుకుందాం’’ అని తన ట్వీటర్‌లో పేర్కొన్నారు సిద్ధార్థ్‌. ప్రస్తుతం తమిళంలో ఓ మూడు సినిమాలు, హిందీలో ఓ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు సిద్ధార్థ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement