సినిమాలు తీస్తా | siddharth malhotra starts production house | Sakshi
Sakshi News home page

సినిమాలు తీస్తా

Jul 7 2019 3:48 AM | Updated on Jul 7 2019 3:48 AM

siddharth malhotra starts production house - Sakshi

బాలీవుడ్‌ బెస్ట్‌ యంగ్‌ హీరోస్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా ఒకరు. హీరో కాకముందు షారుక్‌ ఖాన్‌ నటించిన ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ (2010) సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు సిద్ధార్థ్‌. ప్రస్తుతం హీరోగా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు కదా. హీరోగా రాణిస్తున్న మీరు భవిష్యత్‌లో డైరెక్షన్‌ చేస్తారా? అనే ప్రశ్న ఈ కుర్ర హీరో ముందు ఉంచితే.... ‘‘షారుక్‌గారి సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. కానీ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మొదట్నుంచి నాకు ఫిల్మ్‌ మేకింగ్‌పై స్పెషల్‌ ఫోకస్‌ ఉంది. భవిష్యత్‌లో ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. డైరెక్షన్‌ గురించి మాత్రం ఇప్పుడేం చెప్పలేను’’ అన్నారు. ‘మర్జావాన్‌’ మూవీ సిద్ధార్థ్‌ నెక్ట్స్‌ రిలీజ్‌. ప్రస్తుతం ‘షేర్షా’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement