పడ్డాడండి ట్రాక్‌లో మరి!

Siddharth- GV Prakash film is a trilingual! - Sakshi

గతేడాది ‘గృహం’ సినిమాతో హిట్‌ ట్రాక్‌లో పడ్డ సిద్ధార్థ్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో స్పీడ్‌ పెంచారు. రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. సాయి శంకర్‌ దర్శకునిగా పరిచయం అవుతూ సిద్ధార్థ్‌ సోలో హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌ హీరోలుగా శశి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్‌ మూవీ గురువారం మొదలైంది. ఈ సినిమాను ఓన్లీ తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఇందులో ఒక కథానాయికగా కాశ్మీరి పర్‌దేశీ ఎంపికయ్యారట. ఈ పేరు టాలీవుడ్‌లో ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. నిజమే.. నాగశౌర్య హీరోగా తెలుగులో రూపొందుతోన్న ‘నర్తనశాల’ సినిమాలో కాశ్మీరినే కథానాయిక. ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ కాకముందే కోలీవుడ్‌ నుంచి కాశ్మీరికి కాల్‌ రావడం గొప్ప విశేషమే కదా.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top