వాళ్లు అయినా సిద్ధూను కరుణిస్తారా..! | siddharth doing a malayali film with rathish ambat | Sakshi
Sakshi News home page

వాళ్లు అయినా సిద్ధూను కరుణిస్తారా..!

Sep 18 2015 12:19 PM | Updated on Sep 28 2018 4:15 PM

వాళ్లు అయినా సిద్ధూను కరుణిస్తారా..! - Sakshi

వాళ్లు అయినా సిద్ధూను కరుణిస్తారా..!

చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ను ఓ క్రేజీ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్లో కూడా సరైస సక్సెస్లు లేక కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో మళయాల ఇండస్ట్రీ...

చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ను ఓ క్రేజీ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్లో కూడా సరైస సక్సెస్లు లేక కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో మళయాళ ఇండస్ట్రీ పిలిచి మరీ సిద్దార్థ్కు సినిమా ఛాన్స్ ఇచ్చింది. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్తో కష్టాల్లో ఉన్న ఈ సౌత్ స్టార్కు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

మాలీవుడ్ యాడ్ ఫిలిం మేకర్ రతీష్ అంబట్ తొలి ప్రయత్నంగా తెరకెక్కిస్తున్న సినిమాలో సిద్దార్థ్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. దిలీప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో తొలుత ఫహద్ ఫాజిల్ను హీరోగా నటింపచేయాలని భావించినా, అది వర్క్ అవుట్ కాకపోవటంలో ఫైనల్గా సిద్దార్థ్ ను సెలెక్ట్  చేసుకున్నారు. కొద్ది రోజులుగా తమిళ నాట కూడ అవకాశాలు లేక, ఛాన్స్ల కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ ప్రస్తుతం మళయాళీ ఇండస్ట్రీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు.

జబర్థస్త్ సినిమా తరువాత టాలీవుడ్కి దూరమైన సిద్దార్ధ్ ఇటీవల కావ్యతలైవన్ సినిమాతో కోలీవుడ్ లో మంచి సక్సెస్ సాదించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ సిద్దార్థ్ కెరీర్ను గాడిలో పెట్టలేకపోయింది. ప్రస్తుతం ఒక్క తమిళ సినిమా మాత్రమే చేతిలో ఉన్న సిద్దార్థ్ ఇప్పుడు మళయాళంలో ఆఫర్ రావటంతో కాస్త ఆనందంగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement