శ్రుతీ లాభం

shruti haasan, vijay sethupathi new movie labham - Sakshi

రెండేళ్లుగా తమిళ, తెలుగు సినిమాలేవీ అంగీకరించలేదు శ్రుతీహాసన్‌. సూర్య ‘సింగం 3’, పవన్‌ కల్యాణ్‌తో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత సౌత్‌లో కనిపించలేదు. ఈ రెండు సినిమాలు 2017 ప్రథమార్ధంలో రిలీజయ్యాయి. అప్పటి నుంచి తనలోని నటికి కొంచెం బ్రేక్‌ ఇచ్చి మ్యూజిషియన్‌పై శ్రద్ధ పెట్టారు. లండన్‌లో సొంత బ్యాండ్‌తో మ్యూజిక్‌ షోలు చేశారు. ఓ టీవీ  చానెల్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.

లేటెస్ట్‌గా మళ్లీ తమిళ సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. విజయ్‌ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్‌ దర్శకత్వంలో ‘లాభం’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా పూజ సోమవారం జరిగింది. గతంలో విజయ్‌ సేతుపతితో ‘పురమ్‌బోక్కు ఎన్‌గిర పొదువుడమై’ అనే సినిమా రూపొందించారు జననాథన్‌. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ‘లాభం’తో మళ్లీ విజయ్‌ సేతుపతితో సినిమా చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top