సౌత్‌ నుంచి తొలి అడుగు శ్రుతిదే! | Shruti Haasan to play lead in Sanghamitra | Sakshi
Sakshi News home page

సౌత్‌ నుంచి తొలి అడుగు శ్రుతిదే!

May 10 2017 12:43 AM | Updated on Sep 5 2017 10:46 AM

సౌత్‌ నుంచి తొలి అడుగు శ్రుతిదే!

సౌత్‌ నుంచి తొలి అడుగు శ్రుతిదే!

తెలుగు, తమిళం, హిందీ... శ్రుతీహాసన్‌ మూడు భాషల ప్రేక్షకులకు పరిచయమే. శ్రుతి కథానాయికగా తమిళ దర్శకుడు సుందర్‌. సి మూడు భాషల్లోనూ

తెలుగు, తమిళం, హిందీ... శ్రుతీహాసన్‌ మూడు భాషల ప్రేక్షకులకు పరిచయమే. శ్రుతి కథానాయికగా తమిళ దర్శకుడు సుందర్‌. సి మూడు భాషల్లోనూ ‘సంఘమిత్ర’ అనే భారీ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రారంభం కానుంది.

అదీ ఫ్రెంచ్‌ రివేరా తీరంలో జరగనున్న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో. ఈ 17 నుంచి 28 వరకూ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ప్రతి ఏడాది కాన్స్‌కి పలువురు హిందీ హీరోయిన్లు హాజరవుతారు. అయితే... ఓ సినిమా ప్రారంభోత్సవం నిమిత్తం కాన్స్‌ వెళ్తున్నది మాత్రం శ్రుతీనే. కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌ మీద మెరిసే ఫస్ట్‌ సౌత్‌ హీరోయిన్‌ కూడా ఈమేనని సమాచారం.

విద్యాబాలన్‌ సౌతిండియన్‌ అయినప్పటికీ హిందీ నటిగానే కాన్స్‌కి వెళ్లారు. సౌత్‌లో హీరోయిన్‌గా సెటిల్‌ అయిన బ్రిటన్‌ బ్యూటీ అమీ జాక్సన్‌ సైతం గతేడాది ఫారిన్‌ సంస్థ ప్రచారం నిమిత్తం కాన్స్‌ వెళ్లారు. ఈ ఏడాది ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఇండో–బ్రిటన్‌ సినిమా ప్రచారం కోసం వెళ్తారట!
 

Advertisement
 
Advertisement
Advertisement