విరామానికి విరామం | Shruti Haasan to pair up with Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

విరామానికి విరామం

Feb 2 2019 3:06 AM | Updated on Feb 2 2019 3:06 AM

Shruti Haasan to pair up with Vijay Sethupathi - Sakshi

శ్రుతీహాసన్‌

రెండేళ్లవుతుంది తమిళంలో శ్రుతీహాసన్‌ స్క్రీన్‌పై కనిపించి. సూర్యతో చేసిన ‘సింగం 2’ తమిళంలో శ్రుతి లాస్ట్‌ సినిమా. ఆ తర్వాత సినిమాలను తగ్గించి సంగీతం మీద దృష్టి పెట్టారామె. లండన్‌లో మ్యూజికల్‌ షోలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా వీలున్నంత సమయాన్ని బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ సినిమాను అంగీకరించారు. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

లేటెస్ట్‌గా శ్రుతీ ఓ తమిళ చిత్రం అంగీకరించినట్టు సమాచారం. రెండేళ్ళ గ్యాప్‌ తర్వాత అంగీకరించిన సినిమా ఇది. విజయ్‌ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ అయితే బావుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. శ్రుతీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. శ్రుతీ రెండేళ్ల విరామానికి విరామం ఇచ్చి మళ్లీ సినిమాలను అంతే స్పీడ్‌గా చేస్తారో లేదో చూడాలి మరి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement