నితిన్కు జోడిగా శృతిహాసన్..? | Shruti Haasan for Nithin, Hanu raghavapudi movie | Sakshi
Sakshi News home page

నితిన్కు జోడిగా శృతిహాసన్..?

Nov 4 2016 10:46 AM | Updated on Sep 4 2017 7:11 PM

నితిన్కు జోడిగా శృతిహాసన్..?

నితిన్కు జోడిగా శృతిహాసన్..?

'అ..ఆ..' సినిమాతో 50 కోట్ల క్లబ్లో చోటు సంపాదించుకున్న నితిన్, తరువాత సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. మరోసారి అ..ఆ.. మ్యాజిక్ను రిపీట్ చేస్తూ భారీ కలెక్షన్లు సాధించే పర్ఫెక్ట్ కాంబినేషన్...

'అ..ఆ..' సినిమాతో 50 కోట్ల క్లబ్లో చోటు సంపాదించుకున్న నితిన్, తరువాత సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. మరోసారి అ..ఆ.. మ్యాజిక్ను రిపీట్ చేస్తూ భారీ కలెక్షన్లు సాధించే పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. అ..ఆ.. సినిమాతో నితిన్ రేంజ్ భారీగా పెరిగిపోవటంతో ఈ సినిమా కోసం అదే స్థాయి టాప్ స్టార్స్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అందుకే నితిన్ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటింపచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అ..ఆ.. సినిమాలో నితిన్ జోడిగా సమంత నటించగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ శృతి కూడా నితిన్కు ఓకె చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement