శ్రుతి ఆంతర్యం ఏమిటి? | shruthi hassan get married with her boyfriend soon | Sakshi
Sakshi News home page

శ్రుతి ఆంతర్యం ఏమిటి?

Jan 18 2018 10:12 AM | Updated on Jul 12 2019 3:07 PM

shruthi hassan get married with her boyfriend soon - Sakshi

సాక్షి, చెన్నై: శ్రుతి ఆంతర్యం ఏమిటి? ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల్లో చెలరేగుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. సంగీతం ఈమె ప్రధాన నేస్తం. పలు సంగీత ఆల్బమ్‌లు చేసిన శ్రుతిహాసన్‌ తొలుత సంగీతదర్శకురాలిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నైపోల్‌ఒరువన్‌ చిత్రం సంగీతదర్శకురాలిగా శ్రుతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత లక్కీ అనే హిందీ చిత్రంలో నటిగా అవకాశం రావడంతో నటించి చూద్దాం అన్న ధోరణిలో ఆ చిత్రం చేశారు. 

ఆ చిత్రం విజయం సాధించకపోయినా తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో నటిగా కొనసాగుతున్నారు. అలా కొన్ని సక్సెస్‌లతో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న శ్రుతికి అనూహ్యంగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం ఆమె స్వయంకృతాపరాధమే అనే ప్రచారం జరుగుతోంది. మంచి మార్కెట్‌ ఉండగా సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి వివాదాల్లో చిక్కుకున్న శుత్రికి ఆ తరువాత ఒక్క నూతన చిత్రం అంగీకరించకపోవడం చర్చకు దారి తీసింది. తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు సగంలోనే నిలిచిపోవడం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారిం దనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు. 

ఇటీవల శ్రుతి తన మేను అందంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోం ది. ఆ మధ్య తన గ్లామర్‌పై విమర్శలు రావడంతో తన మేనుకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఒక ప్రముఖ  వైద్యుడి పర్యవేక్షణలో శ్రుతి కూడా తన మేను అందాలను మెరుగు పరుచుకుంటున్నట్లు ప్రచారం. ఇదటుంచితే శ్రుతి ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. 

తండ్రి కమలహాసన్‌కు, తల్లి సారికకు పరిచయం చేసి వారి ఆమోదముద్రను పొందిన శ్రుతి త్వరలో బాయ్‌ఫ్రెండ్‌ మైఖెల్‌ కోర్సెల్‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం మీడియాలో వైరల్‌ అవుతోంది. వివాహనంతరం నటనకు గుడ్‌బై చెప్పి అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌ల రూపకల్పన చేయాలనే ఆలోచనతో శ్రుతిహాసన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై శ్రుతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement