జోడీ కుదిరిందా? | shriya in venkatesh venky mama | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Dec 12 2018 2:33 AM | Updated on Jul 23 2019 11:50 AM

shriya in venkatesh venky mama - Sakshi

వెంకటేశ్, శ్రియ

నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికింది. కొత్త అత్తయ్య ఏంటి? అని కన్‌ఫ్యూజ్‌ కావొద్దు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఓకే అయ్యారు. గతేడాది వచ్చిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలో కలిసి నటించారు చైతన్య అండ్‌ రకుల్‌.

ఇక వెంకటేశ్‌కు జోడీగా కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన తర్వాత ఫైనల్‌గా శ్రియను కన్ఫార్మ్‌ చేశారని తాజా సమాచారం. ఇంతకు ముందు ‘సుభాష్‌ చంద్రబోస్, గోపాల గోపాల’ సినిమాల్లో జంటగా కనిపించారు వెంకీ అండ్‌ శ్రియ. నిజజీవితంలో మామాఅల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లగానే నటించనున్నారు. ఒకవేళ ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ ఫిక్స్‌ అయితే ఈ చిత్రంలో నాగచైతన్యకు శ్రియ వరసకు అత్తయ్య అవుతారు కదా! ఇలా రీల్‌లైఫ్‌లో నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికినట్లే? మరి.. మామాఅల్లుళ్లకు జోడీలు కుదిరిన ట్లేనన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement