వెంకీకి జోడిగా శ్రియ! | Shriya Saran May Act Venkatesh Venky Mama Movie | Sakshi
Sakshi News home page

Jan 30 2019 5:06 PM | Updated on Jan 30 2019 5:46 PM

Shriya Saran May Act Venkatesh Venky Mama Movie - Sakshi

సీనియర్‌ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున సినిమాల్లో హీరోయిన్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతోందట. వీరికి జోడిగా అనుష్క, నయనతార, శ్రియా లాంటి సీనియర్లు మాత్రమే ఆప్షన్స్‌గా కనబడుతున్నారు. కొత్త హీరోయిన్లను తీసుకుందామంటే వీరి స్టార్‌డమ్‌ ముందు సరిపోవడం లేదు. అందుకే ఈ సీనియర్‌ హీరోయిన్లనే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘ఎఫ్‌2’తో ఫామ్‌లోకి వచ్చిన వెంకటేష్‌.. ప్రస్తుతం వెంకీ మామా చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీలో మొదటగా హ్యూమా ఖురేషీని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ పాత్రకు శ్రియాను తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరు సుభాస్‌ చంద్రబోస్‌, గోపాల గోపాల సినిమాలతో సందడి చేశారు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతున్నా.. షూటింగ్‌ను మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రకుల్‌ ప్రీత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement