రోడ్డుపై చిందేసిన హీరోయిన్‌

Shriya Saran Dance On Road In Abroad - Sakshi

నటి శ్రియా నడిరోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్‌లో భాగంగా కాదు.. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో. వారం క్రింతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేయడానికి ఫారిన్‌ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అందరితో కలిసి రోడ్డు మీదనే డ్యాన్స్‌ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలు, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 2001లో ఇష్టం చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. చాలా కాలం పాటు టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోయింది.

శ్రియా గతేడాది రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చివ్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో నటించిన ‘నరకాసురన్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. హిందీలో ‘తడ్కా’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top