నాన్‌స్టాప్‌ | Shraddha Srinath With Nani in Jersey nonstop shootings | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌

Nov 5 2018 2:11 AM | Updated on Nov 5 2018 2:11 AM

Shraddha Srinath With Nani in Jersey nonstop shootings - Sakshi

నాని

గ్రౌండ్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తున్నారు నాని. స్పిన్‌ బౌలింగ్, ఫాస్ట్‌ బౌలింగ్‌ అన్న తేడా లేకుండా బంతిని బాదుతూ ఫీల్డర్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారట. మరి.. ఈ మ్యాచ్‌ను వెండితెరపై చూసేది ఎప్పుడు? అంటే అందుకు కాస్త టైమ్‌ ఉంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. క్రికెటర్‌ అర్జున్‌ పాత్రలో నాని కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శరవేగంగా జరుగుతోందని సమాచారం. పెద్ద బ్రేక్స్‌ తీసుకోకుండా వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేయాలని టీమ్‌ నిర్ణయించుకున్నారని వినికిడి. అంటే.. నాన్‌స్టాప్‌గా ఈ సినిమాను నాని కంప్లీట్‌ చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ చెప్పిన కథ విన్న నాని సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారని తాజా ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement