యాక్షన్‌ సీక్వెల్‌లో మరోసారి శ్రద్ధా | Shraddha Kapoor in Tiger Shroff Baaghi 3 | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ సీక్వెల్‌లో మరోసారి శ్రద్ధా

Feb 12 2019 11:49 AM | Updated on Feb 12 2019 11:49 AM

Shraddha Kapoor in Tiger Shroff Baaghi 3 - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ హిట్ యాక్షన్ సిరీస్‌ బాఘీ. ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అవుతోంది. తెలుగు సూపర్‌ హిట్ వర్షం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బాఘీలో టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధా కపూర్‌లు జంటగా నటించారు. తరువాత మరో తెలుగు సూపర్‌ హిట్‌ క్షణంకు రీమేక్‌గా తెరకెక్కిన బాఘీ 2లో టైగర్‌కు జోడిగా దిశాపటాని అలరించారు.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న మూడో భాగానికి మరోసారి శ్రద్ధానే హీరోయిన్‌గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని నిర్మాత సాజిద్‌ నడియావాలా సోషల్‌ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు.అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సాహోతో పాటు స్ట్రీట్‌ డ్యాన్సర్‌, చిచోరే సినిమాల్లో నటిస్తున్న శ్రద్ధా త్వరలోనే బాఘీ టీంతో జాయిన్‌ కానున్నారు.


Advertisement
 
Advertisement
Advertisement