
రాజ్‌కుమార్ రావ్
ఎవరిది అంటే.. రాజ్‌కుమార్ రావ్ అండ్ టీమ్ ది. ఎందుకు అంటే.. థియేటర్‌లో నవ్విసూ,్త భయపెట్టడానికి. ఎలా అంటే మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే అంటున్నారు ‘స్త్రీ’ చిత్రబృందం. రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్త్రీ’. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కథను అందించారు. ఈ సినిమా షూటింగ్ చందేరీలో జరిగింది. మంగళవారంతో ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ‘‘బ్యూటిఫుల్ టౌన్ చందేరిలో ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాం. సెట్‌లో అందరం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాం. మోస్ట్ అమేజింగ్ టీమ్‌తో వర్క్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్ రావ్.