కమర్షియల్‌ టెంపర్‌ | Short Temper movie launch | Sakshi
Sakshi News home page

కమర్షియల్‌ టెంపర్‌

Mar 3 2019 6:22 AM | Updated on Mar 3 2019 6:22 AM

Short Temper movie launch - Sakshi

శుభాంగి, నవీన్, షాలిని

నవీన్, షాలినీ చౌహాన్‌ , శుభాంగి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘షార్ట్‌ టెంపర్‌’. ప్రవీణా క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రాఘవ దర్శకత్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం హైదరాబాద్‌లో జరిగింది. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా కెమెరా స్విచాన్‌ చేయగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. రైటర్, డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు చేశాను.

అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది. హీరోగారు జిమ్‌లో 8 గంటలు కష్టపడుతున్నారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వరు. కామెడీ టచ్‌ ఉన్న సినిమాలంటే నాకు ఇష్టం. ఇందులో అలీగారు, ఆదిత్యా ఓమ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది చాలా డిఫరెంట్‌ స్టోరీ. బ్యాంకాక్‌లో షూట్‌ చేయనున్నాం’’ అన్నారు  నిర్మాత. ‘‘రాఘవగారు కథ చెబుతున్నప్పుడే సినిమా చూసినట్టు అనిపించింది. బాగా డిజైన్‌ చే శారు’’ అన్నారు నవీన్‌.

Advertisement
 
Advertisement
Advertisement