బెస్ట్‌ చాయిస్‌ | Shivani in 2 States remake | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ చాయిస్‌

Jan 9 2018 12:43 AM | Updated on Jul 14 2019 4:31 PM

Shivani in 2 States remake - Sakshi

‘‘మంచి సినిమాతో పరిచయం చేయాలని ఉంది. సరైన కథ కోసం చూస్తున్నాం’’ అని రెండు మూడు నెలల క్రితం జీవిత ‘సాక్షి’తో అన్నారు. పెద్ద కుమార్తె శివానీ సినీ రంగప్రవేశం గురించి మాట్లాడినప్పుడు ఆమె అలా అన్నారు. ఆ టైమ్‌ వచ్చేసింది. రాజశేఖర్‌–జీవితలకు మంచి కథ దొరికింది. కూతురి సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి ఇది కరెక్ట్‌ మూవీ అని ఫిక్స్‌ అయ్యారు. యస్‌.. శివానీ ఎంట్రీ షురూ అయింది. హిందీ హిట్‌ మూవీ ‘2 స్టేట్స్‌’ రీమేక్‌ ద్వారా శివానీ తెలుగు తెరపై మెరవనుంది. అర్జున్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా నటించిన ‘2 స్టేట్స్‌’ సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే.

అడవి శేష్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో శివానీ హీరోయిన్‌గా దాదాపు ఫిక్స్‌ అయింది. అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రావడమే ఆలస్యం. నూతన దర్శకుడు వెంకట్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘2 స్టేట్స్‌’ కథ విషయానికొస్తే.. ఓ తమిళ బ్రాహ్మణ యువతి, పంజాబీ యువకుడు ప్రేమలో పడతారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి, ఎలా పెళ్లి చేసుకున్నారు? అనేది కథ. లైన్‌ సింపుల్‌ అయినా తీసిన విధానం బాగుంటుంది. అందుకే కుమార్తె ఎంట్రీకి ఇదే ‘బెస్ట్‌ చాయిస్‌’ అని రాజశేఖర్‌ దంపతులు అనుకుని ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement