స్నేహం, ప‌గ నేప‌థ్యంలో ‘స్నేహమేరా జీవితం’ | Shiva Balaji Snehamera Jeevitham Trailer | Sakshi
Sakshi News home page

స్నేహం, ప‌గ నేప‌థ్యంలో ‘స్నేహమేరా జీవితం’

Nov 11 2017 11:54 AM | Updated on Nov 11 2017 12:06 PM

Shiva Balaji Snehamera Jeevitham Trailer - Sakshi

బిగ్ బాస్ సీజన్‌ 1తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివాబాలాజీ నిర్మాత‌గా మారి వెండితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడిగా న‌టించిన శివ‌బాలాజీ ఓ మ‌ల్టీ స్టార‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రాజీవ్ క‌న‌కాల‌, శివ‌బాలాజీలు హీరోలుగా న‌టించిన సినిమా ‘స్నేహ‌మేరా జీవితం’. ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ను దుబాయ్ లో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. వేవ్ రెజొనెంట్స్ ఈవెంట్స్ 10వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా జరిగిన కార్య‌క్రమంలో ఆ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా శివబాలజీ మాట్లాడుతూ.. వాస్త‌వానికి ఈ ట్రైల‌ర్ లాంచ్ ను హైద‌రాబాద్ లో కొంత‌మంది ప్ర‌త్యేక అతిథుల స‌మ‌క్షంలో విడుద‌ల చేద్దామ‌ని ప్లాన్ చేశామ‌న్నారు. అయితే, వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మానికి తాను ఇక్క‌డికి వ‌స్తాన‌ని క‌మిట్ అవ్వ‌డంతో ఇక్క‌డే ట్రైల‌ర్‌ను లాంచ్ చేశామ‌న్నారు. బిగ్ బాస్ షో తర్వాత త‌న‌కు ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ చూస్తోంటే చాలా ఆనందంగా ఉంద‌న్నారు. త్వ‌ర‌లోనే తాను నిర్మించి న‌టించిన స్నేహ‌మేరా జీవితం సినిమా విడుద‌ల కాబోతోంద‌న్నారు. 1982 బ్యాక్ డ్రాప్ లో ఇద్ద‌రు ప్రాణ స్నేహితుల జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించామ‌న్నారు.

Advertisement
 
Advertisement
Advertisement