బిగ్‌ బాస్‌-11 విజేత.. శిల్పా షిండే | Shilpa Shinde Won Bigg Boss 11 Season | Sakshi
Sakshi News home page

Jan 15 2018 9:14 AM | Updated on Jan 15 2018 9:14 AM

Shilpa Shinde Won Bigg Boss 11 Season - Sakshi

సాక్షి, ముంబై : 105 రోజులు, 19 మంది అభ్యర్థులు, వివాదాలు-విమర్శలు.. ఇలా కొనసాగిన బిగ్‌బాస్‌ 11వ సీజన్‌ ముగిసింది. బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ రియాలిటీ షో ఫైనల్ ఎపిసోడ్‌ ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది. 

ఫైనల్‌లో మొత్తం శిల్ఫా షిండే, వికాస్‌ గుప్తా, హీనా ఖాన్‌, పునీష్‌ శర్మలు నిలిచారు. విజేతగా శిల్పా పేరు ప్రకటించటంతో ఒక్కసారిగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం బిగ్ బాస్ 11వ సీజన్‌ విజేత శిల్పా షిండేకు సల్మాన్ ట్రోఫీ అందించాడు. నిజానికి ఫైనల్‌లో నటి హీనాఖాన్‌ గెలుస్తుందని అంతా భావించారు. కానీ, గత కొన్ని ఎపిసోడ్లుగా హీనా ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మొదటి నుంచి షోలో మంచి ఫెర్‌ఫార్మెన్స్‌ కనబరుస్తున్న శిల్పాను అభిమానులు తమ ఓట్లతో గెలిపించారు. హీనా రన్నరప్‌ తో సరిపెట్టుకుంది.

చివరి ఎపిసోడ్‌లో మరో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ అతిథిగా విచ్చేసి ఎపిసోడ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచారు. అభ్యర్థులందరి రాక.. వారి స్టేజ్‌ ఫెర్‌ ఫార్మెన్స్‌లు, చివరికి సల్మాన్‌ చిందులతో కార్యక్రమం తారాస్థాయికి చేరింది. యూట్యూబ్‌ సింగింగ్‌ సెన్సేషన్‌ ఢించక్‌ పూజతో కలిసి సల్మాన్‌-అక్కీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఇక 40 ఏళ్ల శిల్పా షిండే 1999లో బుల్లితెరకు పరిచయం అయ్యారు. స్టార్‌ ఫ్లస్‌లో వచ్చిన సోప్ ఒపేరా భాభి సీరియల్‌లో నెగటివ్‌ రోల్‌తో ఆమె ఆకట్టుకున్నారు. సంజీవని, అమ్రపాలి సీరియళ్లతో మంచి పేరు సంపాదించుకున్న శిల్పా బిగ్‌ బాస్ విజేతగా నిలిచి ట్రోఫీతోపాటు శిల్పా 44లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు.

షో వివరాలు...

మహారాష్ట్రలోని లోనావాలో 19,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిగ్‌బాస్ హౌస్‌ను ఏర్పాటు చేసి చుట్టూ 90 కెమెరాలు అమర్చారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement