రెండింతల హంగామా | Shilpa Shetty To Play A Glamorous Role In Hungama 2 | Sakshi
Sakshi News home page

రెండింతల హంగామా

Dec 2 2019 12:42 AM | Updated on Dec 2 2019 12:42 AM

Shilpa Shetty To Play A Glamorous Role In Hungama 2 - Sakshi

శిల్పాశెట్టి

అయోమయంలో కొందర్ని అపార్థం చేసుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి. తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పుడామె కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. తన తెలివితేటలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కథాంశంతో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘హంగామా’కు ఇది సీక్వెల్‌. ఈ చిత్రానికి కూడా ప్రియదర్శనే దర్శకుడు కావడం విశేషం. ‘హంగామా 2’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇందులో శిల్పాశెట్టి ప్రధాన పాత్రధారి.

పరేష్‌ రావల్, మీజాన్‌ జఫేరి, ప్రణీత కీలక పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు డెహ్రాడూన్‌లో జరుగుతున్నాయని తెలిసింది. 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా ‘నికమ్మా’ సినిమాతో కమ్‌బ్యాక్‌ ఇçస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌ మీద ఉన్నప్పుడే ‘హంగామా 2’ చిత్రానికి సైన్‌ చేశారు. 2007లో ‘అప్నే’లో కథానాయికగా నటించిన తర్వాత ‘ఓం శాంతి’, ‘దోస్తానా’, ‘డిష్‌కియూన్‌’ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు శిల్పా. మళ్లీ కథానాయికగా కనిపించబోతున్నది ‘నికమ్మా’, ‘హంగామా 2’లోనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement