జూనియర్‌ శిల్పా శెట్టి | Shilpa Shetty Kundra, Raj Kundra welcome baby girl | Sakshi
Sakshi News home page

జూనియర్‌ శిల్పా శెట్టి

Feb 22 2020 2:48 AM | Updated on Feb 22 2020 2:48 AM

Shilpa Shetty Kundra, Raj Kundra welcome baby girl - Sakshi

శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా

శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ‘సమిషా’ రూపంలో ఆనందం వాళ్ల ఇంటికి వచ్చింది. విషయం ఏంటంటే... శిల్పా శెట్టి రెండోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు. ‘‘మా ప్రార్థనలను ఆ దేవుడు విన్నట్లున్నాడు. వాటి ఫలితమే సమిషా అనుకుంటున్నాం. ఫిబ్రవరి 15న మా చిన్నారి దేవత ‘సమిషా’ మా ఇంటికి వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. జూనియర్‌ యస్‌యస్‌కే (శిల్పా శెట్టి కుంద్రా)’’ అని చిన్నారి వేలుని పట్టుకొని దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు శిల్పాశెట్టి. అయితే ఈ మధ్యలో శిల్పా శెట్టి గర్భవతి అయినట్టు కనిపించలేదు. మరి సరోగసీ పద్ధతిలో రెండో సారి తల్లయ్యారా? లేక పాపను దత్తత తీసుకున్నారా? తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే శిల్పాకుంద్రాకు వియాన్‌ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement