శర్వానంద్‌ ‘శ్రీకారం’.. సుధీర్‌ బాబు ‘రక్షకుడు’

Sharwanands Sreekaram And Sudheers V Telugu Movies Poster Out - Sakshi

యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ చిత్రం ‘96’రీమేక్‌ విడుదలకు సిద్దం అవుతుండగానే మరో సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్‌ కూడా పూర్తయింది. నూతన డైరెక్టర్‌ కిషోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీకారం’అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించిన శర్వా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

కలర్ ఫుల్ షర్ట్, లుంగీ ఎత్తి కట్టి, నల్ల తువ్వాల భుజంపై వేసుకుని పొలాల్లో నడిచి వస్తున్న శర్వా లుక్ వావ్‌ అనిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘శతమానంభవతి’ తర్వాత పల్లెటూరు నేపథ్యంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో శర్వా రైతుగా కనిపించనున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు.

సుధీర్‌బాబు ‘రక్షకుడు’
నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి కీలక పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్ చిత్రం ‘వి’. విభిన్నచిత్రాల డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో నాని నెగటీవ్‌ రోల్‌ పోషిస్తుండటంతో ఈ చిత్రంపై అంచానలు ఓ రేంజ్‌లో పెరిగాయి.  ఇక ‘కృష్ణుడు గీతలో ఎప్పుడో చెప్పారు.. ‘రాక్షసుడు’ ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు.. రక్షకుడు వస్తున్నాడు’అంటూ చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. 

దీనిలో భాగంగా ఈ చిత్రంలోని ‘రక్షకుడు’  సుధీర్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని టెరిఫిక్ గా ఉన్న సుధీర్ బాబు లుక్ సినిమాపై పాజిటీవ్‌ వైబ్స్‌ను క్రియేట్‌ చేశాయి. “తప్పు జరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం.. సుధీర్ బాబు క్యారెక్టర్‌ను తెలయజేస్తూ  ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఇక ఈ చిత్రంలోని ‘రాక్షసుడు’ నానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం రేపు(మంగళవారం) విడుదల చేయనుంది. అమిత్‌ త్రివేది మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా విడుదల కానుంది. 

చదవండి:
మాయల్లేవ్‌..మంత్రాల్లేవ్‌..ప్రయత్నించానంతే!

‘చివరికి ఆ టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top