మాయల్లేవ్‌..మంత్రాల్లేవ్‌..ప్రయత్నించానంతే!

Sudheer Babu Stunt Photos Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతోన్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు SMS సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్, భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు తన విన్యాసాల‌తో నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నాడు. తాజాగా త‌న ట్విటర్‌లో ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో ఆస‌నాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు.

చదవండి: పోర్న్‌స్టార్‌ చల్లగా ఉండాలంటున్న మాజీ మంత్రి

ఈ ఫోటోల‌కి ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. న‌న్ను న‌మ్మండి అని కామెంట్ పెట్టాడు. కానీ నెటిజన్లు మాత్రం అస్సలు నమ్మట్లేదు. రాత్రికి రాత్రే సుధీర్ తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడా? అందుకే ఇలా గాల్లో ఆసనాలు వేస్తున్నాడా? అంటూ షాక్ అవుతున్నారు. మరి గాల్లో సుధీర్ ఎలా తేలుతున్నాడని మీరు అనుకుంటున్నారా? అందుకు జవాబు కూడా తన ట్విటర్‌లో తెలిపాడు సుధీర్. ‘ఇందులో ఎలాంటి మాయలు, మంత్రాలు లేవని. గాల్లో ఎగురుతూ రకరకాల ఆసనాలు ప్రయత్నించా.. ఈ క్రమంలోనే కెమెరాకు ఈ రెండు ఫొటోలు చిక్కాయని’ తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top