ఉగాదికి రెడీ | nani new movie v poster release | Sakshi
Sakshi News home page

ఉగాదికి రెడీ

Feb 11 2020 1:50 AM | Updated on Feb 11 2020 1:50 AM

nani new movie v poster release - Sakshi

నానీ, సుధీర్‌బాబు

నానీతో ‘అష్మాచమ్మా, జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి వారిద్దరి కలయికలో తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘వి’. అదితీరావు హైదరీ, నివేదా థామస్‌ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేష¯Œ ్స పతాకంపై  ‘దిల్‌’ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్‌ చేస్తున్నారు. నాని 25వ చిత్రం ‘వి’.

ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నారు. ఆయన బారి నుంచి అందర్నీ కాపాడే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. ఇటీవల వీరిద్దరి పాత్రల లుక్స్‌ను విడివిడిగా విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది.  సుధీర్‌బాబు స్టైలిష్‌ లుక్‌తో కనబడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, నేపథ్య సంగీతం: తమన్, కెమెరా: పి.జి.విందా.

Advertisement
 
Advertisement
Advertisement