సెల్పీరాజాతో ఎక్స్ప్రెస్ రాజా | Sharwanand Voice Over For Allari Naresh Selfie Raja | Sakshi
Sakshi News home page

సెల్పీరాజాతో ఎక్స్ప్రెస్ రాజా

Jul 12 2016 11:46 AM | Updated on Sep 4 2017 4:42 AM

సెల్పీరాజాతో ఎక్స్ప్రెస్ రాజా

సెల్పీరాజాతో ఎక్స్ప్రెస్ రాజా

గమ్యం, నువ్వా నేనా.. సినిమాల్లో కలిసి నటించిన యంగ్ హీరోస్ అల్లరి నరేష్, శర్వానంద్ మరో సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు.

గమ్యం, నువ్వా నేనా.. సినిమాల్లో కలిసి నటించిన యంగ్ హీరోస్ అల్లరి నరేష్, శర్వానంద్ మరో సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. అయితే ఇది ఈ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా మాత్రం కాదు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా., ఈ నెల 15న రిలీజ్కు రెడీ అవుతోంది. చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

అందుకే తనతో హిట్ సినిమాల్లో నటించిన  శర్వానంద్ను సెల్ఫీరాజా ప్రాజెక్ట్లో భాగం చేశాడు. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే వాయిన్ నేరేషన్ను శర్వానంద్ అందిస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నరేష్. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెల్పీరాజా సినిమాలో సాక్షి చౌదరి, కామ్నా రనౌత్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement