యంగ్ ఎన్టీఆర్‌గా శర్వానంద్‌..? | Sharwanand to play young NTR in biopic | Sakshi
Sakshi News home page

Mar 6 2018 1:26 PM | Updated on Aug 29 2018 1:59 PM

Sharwanand to play young NTR in biopic - Sakshi

హీరో శర్వానంద్

జై సింహా సినిమా తరువాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న  సంగతి తెలిసిందే. తానే స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌ మీదకు వెళ్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో ఉన్న సన్నివేశాల కోసం ఓ యువ నటుడిని ఎంపిక చేశారట చిత్రయూనిట్‌. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్‌ యంగ్ ఎన్టీఆర్‌గా కనిపించనున్నాడట. 

అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది యువ కథానాయకులు ఉన్నా బాలయ్య శర్వానంద్‌ పేరును పరిశీలిస్తున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను బాలయ్యతో కలిసి వారాహి చలన చిత్రం సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement