మరో యంగ్ డైరెక్టర్‌తో శర్వా..!

Sharwanand Next Movie With Nannu Dhochukundhuvate Fame RS Naidu - Sakshi

హీరో సుధీర్‌ బాబు తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా నన్ను దోచుకుందువటే. ఆసక్తికర ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం మరో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ యువ దర్శకుడు. ఇప్పటికే ఓ లైన్‌ రెడీ చేసుకున్న నాయుడు కథ హీరో శర్వానంద్‌కు బాగుంటుందని భావిస్తున్నాడట.

ఇప్పటికే శర్వానంద్‌కు లైన్‌ కూడా వినిపించిన ఆర్‌ఎస్‌ నాయుడు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందన్న ఆశతో ఉన్నాడు. ఇప్పటికే ఆర్‌ ఎస్‌ నాయుడుతో సినిమా చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. శర్వా ఓకె చెపితే వెంటనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం శర్వానంద్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top