కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

Shankar Approaches Rakul Preet Singh for Indian 2 - Sakshi

గతంలో టాలీవుడ్ సూపర్ ఫాంలో కనిపించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇటీవల కాలంలో కాస్త స్లో అయ్యారు. బాలీవుడ్ మీద దృష్టి పెట్టి టాలీవుడ్‌కు దూరమైన ఈ బ్యూటీ తరువాత యంగ్ హీరోల సరసన అవకాశాలు తగ్గటంతో సీనియర్‌ హీరోతో జత కట్టేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మథుడు 2లో నటిస్తున్న ఈ భామ త్వరలో మరో సీనియర్‌కు జోడిగా నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

సౌత్‌ స్టార్ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజాగా కాజల్‌కు బదులుగారకుల్ ప్రీత్‌ సింగ్‌ను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. రకుల్‌ కూడా కమల్ సరసన నటించేందుకు ఓకె చెప్పారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై భారతీయుడు టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం కమల్‌ బిగ్‌ బాస్‌తో బిజీగా ఉండటంతో భారతీయుడు 2 షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రయూనిట్‌ సిద్ధమవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top