గణిత ఘనాపాటి | Shakuntala Devi first look poster release | Sakshi
Sakshi News home page

గణిత ఘనాపాటి

Sep 17 2019 12:23 AM | Updated on Sep 17 2019 12:28 AM

Shakuntala Devi first look poster release - Sakshi

విద్యా బాలన్‌

ఏదైనా లెక్క కట్టాలంటే వెంటనే కబోర్డ్‌లో ఉన్న క్యాలిక్యులేటర్‌ని వెతుకుతాం. కానీ శకుంతలా దేవికి క్యాలిక్యులేటర్‌ అక్కర్లేదు. వేళ్లతోనే ఎంత పెద్ద లెక్కైనా వేసేస్తారు. అందుకే ఆమెను గణిత ఘనాపాటి అంటుంటారు. హ్యూమన్‌ కంప్యూటర్‌ అన్నట్టు. మ్యాథ్స్‌ జీనియస్‌ శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఇందులో విద్యా బాలన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ‘శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. బాబ్డ్‌ హెయిర్‌ కట్‌తో విద్యాబాలన్‌ కనిపిస్తున్నారు. కంప్యూటర్, క్యాలిక్యులేటర్‌తో జరిగిన రేస్‌లోనూ శకుంతలా దేవియే ఫస్ట్‌ వచ్చిందనే కాన్సెప్ట్‌తో ఈ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement