వెరీ స్పెషల్‌ | Shakeela Speech At Seelavathi Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

వెరీ స్పెషల్‌

Mar 8 2018 4:47 AM | Updated on Mar 8 2018 4:47 AM

Shakeela Speech At Seelavathi Movie Teaser Launch - Sakshi

షకీలా, గీతాంజలి

‘‘ఇది నాకు 250వ సినిమా. మంచి పాత్ర చేశా. తర్వాతి సీన్‌ ఏంటి? అనేది నాక్కూడా తెలియకుండా డైరెక్టర్‌ స్క్రీన్‌ప్లే రాశారు. కథకు న్యాయం జరగాలని నిర్మాతలు రాజీపడకుండా తీశారు. ఇది నాకు వెరీ స్పెషల్‌ మూవీ’’ అన్నారు షకీలా. ‘జి’ స్టూడియోస్‌ సమర్పణలో షకీలా ముఖ్య తారగా సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్‌. గణేష్, వీరు బాసింశెట్టి నిర్మించిన చిత్రం ‘శీలవతి.’ కేరళలో జరిగిన వాస్తవ  సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘షకీలాగారితో ఇది నా రెండవ చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని గీతాంజలి (ఫ్రూటీ) అన్నారు.

‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు గణేష్‌. మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా... సంతృప్తినిచ్చిన సినిమా మాత్రం ‘శీలవతి’. నాకు, షకీలాగారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్‌లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. ఆమె చాలా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు. ‘‘ఇంతకు ముందు షకీలా వేరు.. ఈ సినిమా తరువాత షకీలా వేరు అనేట్లుగా ఈ సినిమా ఉంటుంది. మంచి సైకలాజికల్‌ థ్రిల్లర్‌. హారర్, కామెడీ ఉంటుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement