సెన్సార్‌ సభ్యులకు ‘శీలవతి’ రిక్వెస్ట్‌ | Shakeela Request To Censor Board | Sakshi
Sakshi News home page

Jun 13 2018 1:57 PM | Updated on Jun 13 2018 2:14 PM

Shakeela Request To Censor Board - Sakshi

చాలా కాలం తరువాత షకీలా లీడ్‌ రోల్‌ లో నటిస్తున్న సినిమా శీలవతి. ఈ సినిమా షకీలా 250వ సినిమా కావటం విశేషం. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచిస్తున్నారు.

కేవలం షకీలా సినిమా అన్న కారణంగానే శీలవతి టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచించటంపై నటి షకీలా అభ్యంతరం వ్యక‍్తం చేశారు. సినిమా చూడకుండానే టైటిల్‌ మార్చమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికే  సినిమా ఆలస్యమైంది, శీలవతి పేరుతో చాలా వరకు ప్రమోషన్ చేశాం ఈ పరిస్థితుల్లో టైటిల్‌ను మార్చలేం అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. మరి షకీలా చేసిన అభ్యర్థనపై సెన్సార్‌ సభ‍్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement