‘జీరో’ వసూళ్లు.. నిరాశపరిచిన బాద్‌షా | Shahrukh Khan Zero First Weekend Collections | Sakshi
Sakshi News home page

Dec 25 2018 11:42 AM | Updated on Dec 25 2018 11:42 AM

Shahrukh Khan Zero First Weekend Collections - Sakshi

కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్‌ ఖాన్‌ జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. జీరోకు కూడా డివైడ్‌ టాక్‌ రావటంతో ఆ ప్రభావం కలెక్షన్ల మీద గట్టిగానే కనిపిస్తోంది. భారీ హైప్‌ కారణంగా తొలిరోజు 20 కోట్లకు పైగా వసూళ్లు చేసిన జీరో వీక్‌డేట్స్‌లో అదే రేంజ్‌ కంటిన్యూ చేయలేకపోయింది. తొలి వారాంతానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి నిరాశపరిచింది.

సోమవారం కలెక్షన్లు మరింత భారీగా పడిపోయినా మంగళవారం క్రిస్టమస్‌ సెలవు కావటంతో వసూళ్లు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటించారు.


Advertisement
 
Advertisement
Advertisement