భావోద్వేగానికి గురైన షారుక్‌ ఖాన్‌! | Shahrukh Khan Pays Tribute To His Swades Co Star Kishori Ballal | Sakshi
Sakshi News home page

అమ్మకు ఆ అల్లా తోడుగా ఉండాలి: షారుక్‌

Feb 19 2020 7:37 PM | Updated on Feb 19 2020 7:43 PM

Shahrukh Khan Pays Tribute To His Swades Co Star Kishori Ballal  - Sakshi

కన్నడ నటి కిషోరి బల్లాల్‌(80) మరణవార్త తెలిసి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. నిన్న(మంగళవారం)అనారోగ్యం కారణంగా ఆమె బెంగుళూరులో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షారుక్‌ సోషల్‌ మీడియాలో హృదయపూర్వక లేఖ రాసి ఆమె మృతికి బుధవారం సంతాపం తెలిపాడు. 2004లో విడుదలైన షారుక్‌ ‘స్వదేశ్‌’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆ సినిమా సమయంలో తనతో షారుక్‌కు ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్‌లో భావోద్వేగ పోస్టు షేర్‌ చేశాడు. ‘స్వదేశ్‌’లో షారుక్‌ను ఓ సన్నివేశంలో ఆమె హెచ్చరించిన తీరును గుర్తుచేస్తూ ఆమె గత జ్ఞాపకాలను పంచుకున్నాడు.

వారిద్దరూ ఉన్న ఫొటోకు ‘తన ఆత్మ ప్రశాంతగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. కిషోరి అమ్మను చాలా మిస్సవుతున్నాను. అమ్మా.. ధూమపానం చేయోద్దంటూ నన్ను ఏలా మందలిస్తుందో చూడండి. తన ఆత్మకు అ‍ల్లా తోడుగా ఉండాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా దాదాపు 75కు పైగా సినిమాల్లో నటించిన కిషోరి బల్లాల్‌  బాలీవుడ్‌లో షారుక్‌తోనే కాకుండా బాలీవువడ్‌ స్టార్‌ హీరోయిన్లు రాణిముఖర్జీ, దీపికా పదుకొనెతో కూడా నటించారు. 1960లో విడుదలై కన్నడ చిత్రం ‘ఇవెలెంతా హెందతి’ నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘క్యారీ ఆన్ మరాఠా’, ‘కహి’, ‘సూర్యకాంతి’ ‘క్వీన్‌ గన్‌’ ‘మురుగన్’ వంటి పలు భాష చిత్రాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement