‘ఒకేసారి సినీ జీవితం ప్రారంభించాం’

Shahrukh Khan And Akshay Kumar Wish To Ajay Devgn Over Tanaji Movie - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ చిత్రంపై పలువురు బాలీవుడ్‌ హీరోలు అభినందనలు తెలుపుతూ.. అజయ్‌తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఎందుకంటే  ఆ సినిమా అజయ్‌కి వందో చిత్రం. తాజాగా అక్షయ్ కుమార్.. అజయ్‌ నటించే తన్హాజీ సినిమా పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ..‘మనం ఇద్దరం ​30 ఏళ్ల కింద సినీజీవితాన్ని ఒకేసారి ప్రారంభించాము. అప్పటి నుంచి నీ సినిమాల గ్రాఫ్‌ను చూస్తున్నాను. అది ఎప్పటికప్పుడు మంచి విజయాలతో పెరుగుతూనే ఉంది. నీ వందో చిత్రం తన్హాజీకి అభినందనలు. ప్రేమ, అదృష్టం నీకు కలగాలి సోదరా..’ అని కామెంట్‌ చేశారు.

దీని కంటే ముందు అజయ్‌ 100వ చిత్రంపై బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా తన ట్విటర్‌ ఖాతాలో ‘తన్హాజీ’ సినిమాలోని అజయ్‌ ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నీ నుంచి మరో వంద సినిమాలు రావాలని ఎదరుచూస్తున్నా. మరిన్ని సినిమాల్లో నటించాలి సోదరా. నీ సినీజీవితంలో మైలురాయిగా నిలిచే వందో సినిమాకు అభినందనలు. ఒకేసారి రెండు బండ్ల మీద రైడ్‌ చేయటం నుంచి చాలా దూరం వచ్చావు. ఇక అలాగే స్వారీ చేస్తూ ఉండు.. తన్హాజీకి ఆల్‌ ది బెస్ట్‌.’ అంటూ కామెంట్‌ చేశారు. షారుఖ్‌ ట్విట్‌కు స్పందించిన అజయ్‌.. ‘మీ అభినందనలకు కృతజ్ఞతలు’ అంటూ రిట్వీట్‌ చేశారు. 

మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ సైన్యానికి నాయకత్వం వహించిన సుబేదార్‌ తన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. అజయ్‌ దేవగన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో, కాజోల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ సినిమాను అజయ్‌ దేవగన్, భూషణ్‌ కుమార్, కృష్ణ కుమార్‌ నిర్మిస్తున్నారు. గత నెలలో అజయ్‌ తన లుక్‌ని షేర్‌ చేసి ‘మెదడు.. కత్తికంటే కంటే చాలా పదునైనది’  అని పేర్కొన్న విషయం తెలిసిందే.  జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top