
షాహిద్ కపూర్
గడ్డం ఫుల్‌గా పెరగనిదే సెట్స్‌లోకి రానని చెప్తున్నారట షాహిద్ కపూర్. ఎందుకంటే తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో ఆయన హీరోగా నటించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే హిందీ కూడా చేయనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈపాటికే స్టార్ట్ కావాల్సింది. క్యారెక్టర్ దృష్ట్యా హీరో గడ్డం పెంచాల్సి ఉంది. కానీ షాహిద్‌కు గుబురు గడ్డం రావడానికి ఇంకా టైమ్ పడుతుందట. డూప్లికెట్ గడ్డంతో ప్రొసీడ్ అవుదామన్నా ఒరిజనలే ముద్దు అని ఫిక్సయ్యారట.
అందుకే ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ఆరంభమవుతుంది. ఫైనల్లీ ఈ నెల 20న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన తర్వాత షాహిద్ బ్రేక్ తీసుకుంటారట. ఆయన సతీమణి మీరా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అవుతుండటమే ఇందుకు కారణం. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. హిందీ ‘అర్జున్ రెడ్డి’ వచ్చే ఏడాది జూన్ 21న థియేటర్స్‌లోకి వస్తాడట.