ఆట ఆరంభం | Shahid Kapoor is next project Jersey | Sakshi
Sakshi News home page

ఆట ఆరంభం

Nov 3 2019 12:17 AM | Updated on Nov 3 2019 12:17 AM

Shahid Kapoor is next project Jersey - Sakshi

క్రికెటర్‌గా సాధన మొదలుపెట్టారు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌. ఇండియన్‌ క్రికెట్‌ జుట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగులో సూపర్‌హిట్‌ సాధించిన ‘జెర్సీ’ చిత్రం హిందీ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్నారు. ఇందులో 36 ఏళ్ల క్రికెటర్‌ పాత్రలో నటించబోతున్నారాయన. ఈ సినిమా కోసమే క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరియే హిందీ రీమేక్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 28న విడుదల కానుంది. మరోవైపు తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్న షాహిద్‌ వెంటనే మరో తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement