బాక్సర్‌ షాహిద్‌ | shahid kapoor manipur boxer cingco singh biopic | Sakshi
Sakshi News home page

బాక్సర్‌ షాహిద్‌

Aug 31 2018 2:10 AM | Updated on Aug 31 2018 2:11 AM

shahid kapoor manipur boxer cingco singh biopic - Sakshi

బాలీవుడ్‌లో బయోపిక్స్‌ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బేస్డ్‌ బయోపిక్స్‌కు బాగా గిరాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ రన్నర్‌ మిల్కాసింగ్, లేడీ బాక్సర్‌ మేరి కోమ్, క్రికెటర్‌ ధోనీ, రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫోగట్, హాకీ ప్లేయర్స్‌ సందీప్‌సింగ్, బల్బీర్‌సింగ్‌ బయోపిక్‌లు  వెండితెరపైకి వచ్చాయి. క్రికెటర్‌ కపిల్‌దేవ్, ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్, బ్యాడ్మింట¯Œ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్స్‌ రానున్నాయి.

ఇప్పుడీ జాబితాలోకి మణిపూర్‌ బాక్సర్‌ డింగ్‌కో సింగ్‌ బయోపిక్‌ చేరనుంది.  రాజ కృష్ణమీనన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్నారు. ‘‘1998 బ్యాంకాక్‌ ఆసియన్‌ గేమ్స్‌లో బాటమ్‌ వెయిట్‌ కేటగిరీలో డింగ్‌కో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. పద్మశ్రీ అవార్డు కూడా సాధించారు. ఆ తర్వాత క్యాన్సర్‌ వ్యాధితో బాధపడ్డారు. ఇలా ఆయన జీవితంలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల చరిత్ర అందరికీ తెలియాలి’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement